ఏమో గుర్రం…….. ఎగురావచ్చు … రామబంటు భక్తుడు రాజ్యమేలవొచ్చు…
ఏమో గుర్రం…….. ఎగురావచ్చు … రామబంటు భక్తుడు రాజ్యమేలవొచ్చు…
ఆదివారం : అటు చూస్తే దియేటర్లో గర్ల్ ఫ్రెండ్ …ఇటు చూస్తే తెలుగు బ్లాగర్స్ … ఎటు కేగుటో సమస్యగా ఘనీభవించిందొక బ్లాగరుకి..
పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ ఎం.ఏ జ్యోతిష్యం (దూర విద్యా విధానం ) కోర్సుకి నోటిఫికేషన్ ఇచ్చింది.
తెలుగు వారందరికీ.. అందులోను తెలుగు బ్లాగరులకు ప్రత్యేకంగా… దీపావళి శుభాకాంక్షలు..మళ్ళీ తెల్గు బ్లాగ్ప్రపంచానికి వచ్చేస్తున్నా..
I cant understand gilrs, OMG
World’s first Tidal power Turbine started generating electricity: http://tinyurl.com/62o7lm
I think twitter has a very less trafiic from india…only 1%
sticked to twistori.com
తారాగణం:జూ ఎన్టీయార్, హన్సికా మోత్వానీ,తనీషా (స్త్రీ లింగం), ప్రకాష్ రాజ్ , ఆశిష్ విద్యార్ధి,, షియాజీ షిండే, ముఖేష్ రుషి, సుబ్బ రాజు, కోట శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ, రాజా , జయప్రకాష్ రెడ్డీ , పింగ్ పాంగ్
హాస్య నట వర్గం: రఘు బాబు, సునీల్, ఆలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కృష్ణ భగవాన్,బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ,
నిర్మాత: అశ్వినీ దత్ ( 30 ఇయర్స్ ఇండస్ట్రీ)
కధ, మాటలు, స్క్రీన్ ప్లే – దర్శకత్వం – మెహర్ రమేష్
సుత్తి లేకుండా…సూటిగా చెబుతా! ఈ సినిమా మూడు సినిమాలను కలిపి రుబ్బిన వంటకం.
1. పోకిరి.
2. మున్నా ( ప్రభాస్ )
3. జూ. ఎన్టీయార్ ఆత్మ కధ…
![]()
యుధ్దం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా….??? నాకు తెలుసు…!!! యుద్దం ఆంటే..హైద్రాబాద్ ట్రాఫిక్ అంత భయంకరంగా ఉంటుంది. ఒక సారి మొదలెట్టామా…ఇక ఆపడానికి ఉండదు. అంటే..రయ్యి రయ్యి మని సాగిపోవచ్చు…ఆగేది ఉండదు అని కాదు. నీకు విసుగు పుట్టి…బండి వదిలేసి..వెళ్ళిపోదామన్నా కుదరదు అని…అన్న మాట!!
మొదటిసారి హైదరాబాదు తెలుగు బ్లాగరుల సమావేశానికి వెళ్ళాను. అక్టోబర్ 14న, హైదరాబాదులో యూసఫ్‌గూడ కృష్ణకాంత్ పార్క్.
మరి ఈ రోజు తారీఖు – అక్టోబర్ 25, అప్పుడెప్పుడో బ్లాగరుల మీటింగ్‌కి వెళ్తే… ఇప్పుడు రాస్తున్నానేంటి??? ఏమి చేయను. అప్పటి నుంచి హైదరాబాదులోనే ఉన్నాను. ఇప్పుడే విజయవాడ వచ్చాను.
ఇక విషయానికి వొస్తే…. ఈ మధ్య కాలంలో నేను చేసిన మంచి పనులలో ఇది ఒకటి. : తెలుగు బ్లాగరుల మీటింగ్‌కి వెళ్ళటం.

Posted by mobile phone:
Yum! blogging from my mobile. thanks to nokia, vodafone, wordpress people.
రాజు సైకం, తెలుగు బ్లాగు, తెలుగు, విజయవాడ, ముద్ర -డిగ్ తెలుగు బ్లాగులు,
మ్మ్… చిరంజీవి సిన్మా అంటే మొదటి రోజే చూడాలి… కాలేజి రోజుల్లో ఉదయాన్నే…ఆరింటికి బెనిఫిట్ షో చూసేవాళ్ళం. ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళి…ఒక సారి ఆఫీస్‌లో కనిపించి ..ఇక చిరుతని కలవటానికి వెళ్ళి ఇదుగో ఇప్పుడే వచ్చాను.
ఇక సిన్మా విషయానికి వస్తే… ఎవరు ఈ సిన్మా కి వెళ్ళినా…ఛిరంజీవి నట వారసుడి సిన్మా కాబట్టి. సో రామ్ చరణ్ విషయానికి వస్తే..
ప్రతి అభిమాని ఆశించిన విధంగానే.. డాన్సులు చాలా బాగా చేసాడు. యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా ఈజ్‌తో చేసాడు. ఎవరి కొడుకు మరీ…
మొదటి సినిమా కదా…అని చూస్తే…చిరుత బాగానే కనిపించాడు. బాగానే అలరించాడు.
చిరంజీవి కొడుకు లెక్కన చూడాలంటే.. వాయిస్ బాగున్నా…కొన్ని చోట్ల డైలాగ్ డెలివరీ అంతగా నప్పలేదు. కొన్ని చోట్ల డీగ్లామరస్డ్ కూడా ఉన్నాడు.అదే సమయంలో సిన్మాలో అధిక సమయం…చాలా అందంగా కనిపించాడు.
గూగిల్ కి 9వ జన్మదిన శుభాకాంక్షలు
ఎన్నో రోజులుగా మంచి ఫోన్ కొనుక్కోవాలన్న కోరిక నిన్న రాత్రి ‘ఎన్70 ఎమ్’ తో తీరింది. మొత్తానిని నేను కూడా ‘ఎన్ సిరీస్’ అయ్యాను.
Now I am N Series
2 మెగా పిక్సెల్ కేమేరా ఉందిగా… ఇక ప్రపంచం అంతా నా మొబైల్ కెమేరా కన్నుతోనే చూస్తానేమో! … 1 జిబి మెమరీ ఉంది… ఇంకేంటి… ఇక నేను కూడా…ఫ్లిక్కర్లో ఉంటానోచ్…
ఇక GPRS యాక్టివేట్ అయితే… నా మొబైల్ నుంచి ఇక్కడికి ఒక బ్లాగు టపా పోస్ట్ చేయాలి.
అవునూ!!, ఇందులో తెలుగు ఫాంట్ కనిపిస్తుందా?????
ట్వంటీ-20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్, పాక్‌పై 5 పరుగుల తేడాతో విజయం సాధించి కోట్లాది భారత క్రీడాభిమానులు హృదయాలు ఆనందంతో ఉప్పోంగిపోయేలా తొలి ట్వంటీ-20 ప్రపంచ కప్ గెలుచుకుంది.
ఎట్టకేలకు, చిర కాలంగా ఊరిస్తున్న ప్రపంచ కప్ యువ హీరోల సమిష్టి కృషితో…. భారత్ వశమైంది.

భారత్-పాక్ మధ్యన మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో భారత్ యువ హీరోలు, పాక్‌ని చివరి నిమిషంలో ఖంగు తినిపించి,అప్పటి దాకా దోబూచులాడుతున్న విజయాన్ని వరించి…ఎంతోకాలంగా భారత్‌ని ఊరిస్తున్న ప్రపంచ కప్ (ట్వంటీ-20) ని గెలవటంతో ఒక్కసారిగా భారత్ ఆటగాళ్ళలో ఒక్కసారిగా విజయానందంతో మైదానమంతా విజయవిహారం చేసారు.
ఎక్కడైతే పోగొట్టుకొనారో భారత్ ఆటగాళ్ళు అక్కడే గెలుచుకున్నారు. 2003 ప్రపంచ కప్ ఫైనల్లో ఇదే స్టేడియంలో భారత్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ప్రపంచ కప్‌ని చేజార్చుకుంది.
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, విజయవాడలో ఈ రోజు ప్రారంభమయ్యాయి. విజయవాడలోని బందర్ రోడ్డు ఆనుకుని ఉన్న శేషసాయి కళ్యాణ మంటపంలో ఈ సభలను రాష్ట్ర గవర్నర్ నారయణదత్ తివారి ప్రారంభించారు.
ఈ మహాసభలు ఈరోజు నుంచి మూడు రోజుల (సెప్టెంబర్ 21,22 & 23)పాటు జరుగుతాయి.
ఈ సభలను కృష్ణా జిల్లా రచయితల గౌరవ సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ (రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి) పర్యవేక్షిస్తారు.
భారత స్వాతంత్రోద్యమ వజ్రోత్సవాలను పురస్కరించుకుని జరుపుతున్న ఈ మహా సభలకు సుమారు వెయ్యి మంది వరకు రచయితలు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు చెపుతున్నారు.
తెలుగు బ్లాగరులు ఎవరైనా వీటికి హాజరు అవుతున్నారా? ఎవరైనా విజయవాడ వస్తుంటే.. నాకు తెలియచేయండి. కలవగలము.
Recent Comments